ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి | dcc kota sathyam fires on tdp government | Sakshi
Sakshi News home page

ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి

Sep 28 2016 12:00 AM | Updated on Sep 4 2017 3:14 PM

రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పరిపాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు.

అనంతపురం సెంట్రల్‌ : రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా పరిపాలన సాగిస్తున్న టీడీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేయాలని డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ పిలుపునిచ్చారు. మంగళవారం కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ కరువు కాటకాలు, ప్రాణాంతక రోగాలతో జిల్లావాసులు విలవిలలాడుతున్నారన్నారు. జిల్లావ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు సాగు చేసిన రైతులు దాదాపు రూ. 3 వేల కోట్లు పెట్టుబడులు పెట్టి నష్టపోయారన్నారు.

హెచ్చెల్సీ కిందనైనా నీరిచ్చి ఆదుకుంటారనుకుంటే జిల్లాకు రావాల్సిన నీటిని కర్నూలు తరలించారని ఆవేదన వ్యక్తం చేశారు.   పంట నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఇన్‌పుట్‌ సబ్సిడీ, బీమా విడుదల చేయాలన్నారు. హంద్రీనీవా ద్వారా 30 టీఎంసీల నీటిని తీసుకొచ్చి ఆయకట్టుకు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు రమణ, వాసు, మాసూలు శ్రీనివాసులు, శివ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement