క్రీడా పోటీల తేదీల్లో మార్పు | date changed to sports competetions | Sakshi
Sakshi News home page

క్రీడా పోటీల తేదీల్లో మార్పు

Sep 29 2016 12:11 AM | Updated on Sep 4 2017 3:24 PM

రాష్ట్రస్థాయి ఉద్యోగుల క్రీడా పోటీల తేదీ లను మార్పు చేసినట్లు జిల్లా క్రీడాభి వృద్ధి అధికారి బాషామోహిద్దీన్‌ ప్రకటనలో తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : రాష్ట్రస్థాయి ఉద్యోగుల క్రీడా పోటీల తేదీ లను మార్పు చేసినట్లు జిల్లా క్రీడాభి వృద్ధి అధికారి బాషామోహిద్దీన్‌ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పో టీలు వచ్చే నెల 17 నుంచి 19 వర కు రాష్ట్ర రాజధాని విజయవాడలో జరగాల్సి ఉం ది. వాటిని వచ్చే నెల 5 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు ఐ జీఎంసీ స్టేడి యం, విజయవాడలో సం ప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 0855 4–243175 నంబ ర్‌ను సంప్రదించాలన్నారు.

పోటీల వివరాలు : విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో అక్టోబర్‌ 5న బ్యాడ్మింటన్, బాస్కెట్‌ బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, బెస్ట్‌ ఫిజిక్, బ్రిడ్జ్‌ పోటీలు నిర్వహిస్తారు. గాందీనగర్‌ కార్పొరేషన్‌ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత పోటీలుంటాయి. 6న క్యారమ్స్, హాకీ, లాన్‌ టెన్నిస్, పవర్‌ లిఫ్టింగ్, 7న చెస్, క్రికెట్, టేబుల్‌టెన్నిస్, వాలీబాల్, రెజింగ్, అథ్లెటిక్స్‌ పోటీలు ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement