breaking news
basha mohiddin
-
క్రీడా పోటీల తేదీల్లో మార్పు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్రస్థాయి ఉద్యోగుల క్రీడా పోటీల తేదీ లను మార్పు చేసినట్లు జిల్లా క్రీడాభి వృద్ధి అధికారి బాషామోహిద్దీన్ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పో టీలు వచ్చే నెల 17 నుంచి 19 వర కు రాష్ట్ర రాజధాని విజయవాడలో జరగాల్సి ఉం ది. వాటిని వచ్చే నెల 5 నుంచి 7 వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా జట్లకు ఎంపికైన క్రీడాకారులు ఐ జీఎంసీ స్టేడి యం, విజయవాడలో సం ప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 0855 4–243175 నంబ ర్ను సంప్రదించాలన్నారు. పోటీల వివరాలు : విజయవాడ ఐజీఎంసీ స్టేడియంలో అక్టోబర్ 5న బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, కబడ్డీ, ఫుట్‌బాల్, వెయిట్‌లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, బ్రిడ్జ్ పోటీలు నిర్వహిస్తారు. గాందీనగర్ కార్పొరేషన్ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత పోటీలుంటాయి. 6న క్యారమ్స్, హాకీ, లాన్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, 7న చెస్, క్రికెట్, టేబుల్‌టెన్నిస్, వాలీబాల్, రెజింగ్, అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయి. -
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలకు జిల్లా జట్ల ఎంపిక గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి బాషా మోహిద్దీన్ పర్యవేక్షించారు. ఈ నెల 27 నుంచి 29 వరకు విజయనగరం జిల్లాలో జరిగే క్యాడెట్ అంతర జిల్లాల పోటీల్లో (14 ఏళ్లలోపు ) హాజరయ్యేందుకు జట్ల ఎంపిక జరిగినట్లు జిల్లా తైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ జరిగిందని, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసినట్లు చెప్పారు. బాలుర జట్టు భరత్ (33 కేజీలు), మణికంఠ (37 కేజీలు), శివక్రిష్ణ (41 కేజీలు). నదీమ్ ఖాన్ (45 కేజీలు), నరసింహ (49 కేజీలు), సైలాని బాబా(53 కేజీలు), మధు(57 కేజీలు), ప్రవీణ్ (61 కేజీలు), జయేష్ (65 కేజీలు), బాలికల జట్టు రోజా (33 కేజీలు), ప్రశాంతి (37 కేజీలు), హేమా(47 కేజీలు). ఈ కార్యక్రమం లో ప్రధాన కార్యదర్శి గోపాల్ రెడ్డి, బాస్కెట్ బాల్ కోచ్ జగన్నాథరెడ్డి, ట్రెజరర్ కమ్మన్న, సీనియర్ క్రీడాకారులు రామాంజనేయులు, తులసీరామ్, ఉమామహేశ్వర్, కేశవులు పాల్గొన్నారు.