సాంకేతిక భద్రతా వ్యవస్థతో సైబర్‌ నేరాల అదుపు | cyber crime control by technology | Sakshi
Sakshi News home page

సాంకేతిక భద్రతా వ్యవస్థతో సైబర్‌ నేరాల అదుపు

Aug 22 2016 11:47 PM | Updated on Sep 4 2017 10:24 AM

సైబర్‌ నేరాలు – భద్రత సదçస్సును జ్యోతిప్రజ్వలన చేసిన ప్రారంభిస్తున్న ఎస్వీయూ వీసీ దామోదరం

సైబర్‌ నేరాలు – భద్రత సదçస్సును జ్యోతిప్రజ్వలన చేసిన ప్రారంభిస్తున్న ఎస్వీయూ వీసీ దామోదరం

సాంకేతిక భద్రతా వ్యవస్థతోనే సైబర్‌ నేరాల అదుపు సాధ్యమని మాజీ డీజీపీ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం సైబర్‌ నేరాలు – భద్రత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

 
తిరుపతి మంగళం : సాంకేతిక భద్రతా వ్యవస్థతోనే సైబర్‌ నేరాల అదుపు సాధ్యమని మాజీ డీజీపీ కేసీ రెడ్డి పేర్కొన్నారు. ఎస్వీయూలోని శ్రీనివాస ఆడిటోరియంలో సోమవారం సైబర్‌ నేరాలు – భద్రత అనే అంశంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్వీయూ వీసీ దామోదరం జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన కేసీ రెడ్డి ‘ప్రపంచీకరణలో సైబర్‌ సెక్యూరిటీ అవశ్యకత – ఉపాధి అవకాశాలు’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు. సాంకేతికత పెరిగే కొద్ది సైబర్‌ నేరాల సంఖ్య కూడా పెరిగిపోతోందన్నారు. నేరాలను అదుపు చేయడం ఒక్క సెక్యూరిటీ వ్యవస్థతోనే సాధ్యపడుతుందని తెలిపారు. ఉపాధి అవకాశాలున్న సైబర్‌ సెక్యూరిటీ కోర్సులను ఎంచుకుని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని కోరారు. ఎస్వీయూ వీసీ మాట్లాడుతూ ఏ ఇతర యూనివర్సిటీల్లో లేనివిధంగా సైబర్‌ సెక్యూరిటీ కోర్సును ఎస్వీయూలో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ దేవరాజులు, రెక్టార్‌ భాస్కర్, సీఆర్‌రావు ఇన్‌స్టిట్యూట్‌ (హైదరాబాద్‌) ప్రతినిధి అరుణ్‌కుమార్, ఈఎస్‌ఎఫ్‌ ల్యాబ్‌ ఎండీ అనిల్, రాజగోపాలన్, ప్రొఫెసర్‌ సుదర్శనం, ఫ్రొఫెసర్‌ రామ్‌మోహన్‌రెడ్డిlపాల్గొన్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement