రూ.4 లక్షల కరెన్సీ నోట్లు బుగ్గిపాలు | currency notes of Rs 4 lakh burned | Sakshi
Sakshi News home page

రూ.4 లక్షల కరెన్సీ నోట్లు బుగ్గిపాలు

May 5 2016 8:35 PM | Updated on Sep 5 2018 9:45 PM

వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన గాదం రవి పెంకుటిల్లు బుధవారం రాత్రి అగ్నిప్రమాదంలో దగ్ధమైంది.

దుగ్గొండి: వరంగల్ జిల్లాలోని దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన గాదం రవి పెంకుటిల్లు బుధవారం రాత్రి అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.నాలుగు లక్షల విలువైన కరెన్సీ నోట్లు(రూ.500, 1000) కాలిబూడిదయ్యాయి, కొన్ని సగం వరకు కాలిపోయాయి. బంగారు ఆభరణాలు మంటలకు మాడిపోయాయి. మరో రెండు రోజుల్లో భూమి కొనుగోలుకు డబ్బులు చెల్లించాల్సి ఉందని, తను కష్టపడి సంపాదించుకున్న సొమ్మంతా బుగ్గిపాలైందని రవి దంపతులు బోరున విలపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement