'వెంకయ్య మోసగాడిగా మిగిలిపోతారు'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, ప్రత్యేక ప్రాకేజీ అవసరం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మోసగాడిగా మిగిలిపోతారని చెప్పారు.
ఈనెల 22, 23 తేదీల్లో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మేధావులతో సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీపీఐ మంగళవారం నిర్వహించిన రాష్ట్రవ్యాప్త బంద్ కు కాంగ్రెస్, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి.