ఆవుల అపహరణ గ్యాంగ్‌ అరెస్ట్‌ | cows theft gang arrest | Sakshi
Sakshi News home page

ఆవుల అపహరణ గ్యాంగ్‌ అరెస్ట్‌

Dec 7 2016 11:57 PM | Updated on Aug 21 2018 5:51 PM

ఆవుల అపరహణ గ్యాంగ్‌ను ఆదోని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం ఆ వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు.

– రూ.76వేల నగదు రికవరీ 
ఆదోని టౌన్‌: ఆవుల అపరహణ గ్యాంగ్‌ను ఆదోని పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం ఆ వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఆదోని పరిసర ప్రాంతాల్లో ఆవులు, ఎద్దులు, దూడలు అపహరణకు గురయ్యేవి. గతనెల 17వ తేదీన ఎమ్మిగనూరు రోడ్డులో నివాసముంటున్న చాకలి వెంకటేష్‌కు చెందిన రెండు ఆవులను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు అందింది. ఫిర్యాదును స్వీకరించిన త్రీ టౌన్‌ సీఐ చంద్రశేఖర్, ఎస్‌ఐ సునీల్‌ కుమార్, సిబ్బంది రవి, మల్లికార్జున, ఎలీషా రంగంలోకి దిగారు. సీసీ కెమెరా పుటేజ్‌ ఆధారంగా ఆవులను ఆటోలో ఎత్తుకెళ్లే సమయంలో వన్నెల శివను గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకోవడంతో డొంక కదిలింది. పట్టణంలోని బుడ్డేకల్‌కు చెందిన వన్నెల శివ, వన్నెల రామాంజనేయులు, మహ్మద్‌ ఎక్బాల్,  మహ్మద్‌ అక్బర్‌లు.. ఆదోని ప్రాంతంలోఆవులను అపహరించుకుపోయి పత్తికొండలోని రాజేష్, వన్నెల ఈరప్పకు అప్పగించేవారని డీఎస్పీ తెలిపారు. పత్తికొండ, చుట్టుపక్కల వారపు సంతల్లో ఆ ఆవులను రాజేష్, ఈరప్ప విక్రయించేవారని చెప్పారు. వచ్చిన సొమ్మును ఇరువురు పంచుకునే వారని తెలిపారు. ఈ వ్యవహారం కొన్నాళ్లుగా జరుగుతున్నట్లు చెప్పారు. పట్టణంలో 15 ఆవులను ఎత్తుకెళ్లి సంతల్లో అమ్ముకున్నారని..వాటి విలువ రూ.76వేలు రికవరీ చేసినట్లు చెప్పారు. ఎక్బాల్‌ బాషాపై కౌతాళం పోలీస్‌ స్టేషన్‌లో ఆవుదొంగతనం కేసు.. అక్బర్‌పై పెద్దతుంబళం పోలీస్‌ స్టేషన్‌లో మేకల దొంగతనం కేసు ఉన్నట్లు చెప్పారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామని డీఎస్పీ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement