విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కలకలం | country gun caused sensation in vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరం జిల్లాలో నాటు తుపాకీ కలకలం

Dec 15 2015 5:41 PM | Updated on Sep 3 2017 2:03 PM

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం పెద్దబుద్దిడి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు నాటు తుపాకులతో సంచరించడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం పెద్దబుద్దిడి గ్రామ పరిసర ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు నాటు తుపాకులతో సంచరించడం స్థానికంగా సంచలనం సృష్టించింది. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఐదుగురు నాటు తుపాకీలు, లైట్లతో అటుగా వెళ్లారు. బహిర్బూమికి వెళ్లిన యువకులు దీన్ని గమనించారు. గుర్తు తెలియని వ్యక్తులను 'మీరెవరు అంటూ ప్రశ్నించగా'.. వారు పరారయ్యారు. ఆ సమయంలో ఓ నాటు తుపాకీ కిందపడింది. దొరికిన నాటు తుపాకీని యువకులు మంగళవారం పోలీసులకు అప్పగించారు. యువకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement