స్వల్పంగా పెరిగిన పత్తి ధర | cotton price increased | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన పత్తి ధర

Mar 4 2017 11:25 PM | Updated on Sep 5 2017 5:12 AM

స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి.

క్వింటాల్‌ రూ. 6,165
 
ఆదోని: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పత్తి ధరలు స్వల్పంగా పెరిగాయి.  సోమవారం క్వింటాల్‌ ధర రూ.6వేలు పలికింది. రోజూ రూ.50 పెరుగుతూ శనివారం రూ.6165 పలికింది. గత వారం శివరాత్రి పండుగకు ముందు క్వింటాలు రూ.6వేలు మార్క్‌ దిగువకు పడి పోయి వారాంతం వరకు అదే ధర కొనసాగింది. దీంతో ధర మరింత పడిపోతోందని రైతుల్లో ఆందోళన వ్యక్తం అయింది. అయితే వారం మొదటి రోజు నుంచి ధర ఆశాజనకంగా కొనసాగడంతో రైతుల్లో సంతోషం వ్యక్తం అయింది.
 

Advertisement
 
Advertisement
Advertisement