అదనపు పరీక్షల నియంత్రణాధికారుల కొనసాగింపు | continued Additional tests conrtolars | Sakshi
Sakshi News home page

అదనపు పరీక్షల నియంత్రణాధికారుల కొనసాగింపు

Sep 1 2016 1:11 AM | Updated on Mar 19 2019 9:23 PM

కాకతీయ యూనివర్సిటీలోని నలుగురు అదనపు పరీక్షల నియంత్రణాధికారులను కొనసాగిస్తూ కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి. బెనర్జీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కేయూక్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని నలుగురు అదనపు పరీక్షల నియంత్రణాధికారులను కొనసాగిస్తూ కేయూ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ జి. బెనర్జీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాన్ఫిడెన్షియల్‌ విభాగంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారి జి.రామేశ్వరం, దూరవిద్య అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ సీహెచ్‌.రాజేశం, డిగ్రీ విభాగం అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ పి. మల్లారెడ్డి, పీజీ కోర్సుల విభాగం అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ వి.రాంచంద్రంను కొనసాగిస్తూ అంటిల్‌æఫర్‌దర్‌ ఆర్డర్స్‌తో ఉత్తర్వులు జారీ చేసినట్లు బెనర్జీ తెలిపారు. ఆ నలుగురి పదవీ కాలం గత మంగళవారంతో ముగిసింది. దీంతో వారిని మళ్లీ కొనసాగిస్తూ వీసీ ప్రొఫెసర్‌ ఆర్‌.సాయన్న అప్రూవల్‌ మేరకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement