ఎంసెట్-2 లీకేజీలకు బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.
ఎంసెట్-2 లీకేజీలకు బాధ్యత వహిస్తూ మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని బస్టాండ్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రీయ రహదారిపై గంటపాటు ఆందోళన చేపట్టారు. దీంతో పట్టణంలో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నేతలు రమేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.