ముగిసిన అంత్య పుష్కరాలు | completed antya pushkaralu | Sakshi
Sakshi News home page

ముగిసిన అంత్య పుష్కరాలు

Aug 11 2016 11:16 PM | Updated on Oct 17 2018 6:06 PM

ముగిసిన అంత్య పుష్కరాలు - Sakshi

ముగిసిన అంత్య పుష్కరాలు

పవిత్ర గోదావరి నది అంత్య పుష్కరాలు ముగిశాయి. చివరి రోజైన గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు.

రెంజల్‌ : పవిత్ర గోదావరి నది అంత్య పుష్కరాలు ముగిశాయి. చివరి రోజైన గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీంతో కందకుర్తి త్రివేణి సంగమంలో సందడి నెలకొంది. జిల్లాతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. పుష్కర క్షేత్రంలోని 4 ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. పుణ్య స్నానాలు చేసిన అనంతరం నదిలోని పురాతణ శివాలయంతో పాటు ఒడ్డన గల పుష్కరరాజ్‌ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అంతిమ పుష్కరాల చివరి రోజు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో రెంజల్‌ ఎస్సై రవికుమార్‌ పర్యవేక్షణ చేపట్టారు. గజ ఈతగాళ్ళను అప్రమత్తం చేశారు. సుమారు 5 వేల మంది కందకుర్తిలో పుణ్యస్నానాలను ఆచరించినట్లు అర్చకులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement