ఆనందమయ జీవితానికి నీమ్‌ కరోలీబాబా సూక్తులు

neem karoli baba life lessons - Sakshi

నీమ్‌ కరోలీ బాబాను హనుమంతుని స్వరూపంగా భావిస్తారు. 20వ శతాబ్ధపు మహనీయులలో అతనిని ఒకరిగా గుర్తిస్తారు. ఆయనకు ఎన్నో సిద్ధులు కూడా ఉన్నాయని చెబుతుంటారు. ఈ సిద్ధుల కారణంగానే అతని మహిమలు ప్రపంచానికంతటికీ తెలిశాయని అంటుంటారు. కరోలీ బాబా ఆశ్రమం నైనితాల్‌కు 65 కిలోమీటర్ల దూరంలోగల పంత్‌నగర్‌లో ఉంది.

బాబా తన అలౌకిక శక్తులతోనే కాకుండా తన సిద్ధాంతాల ద్వారా కూడా అందరికీ సుపరిచితమయ్యారు. 1900వ సంవత్సరంలో జన్మించిన ఆయన 1973లో కన్నుమూశారు. మనిషి ఆనందంగా ఉండేందుకు జీవితంలో ఎలా మెలగాలో నీమ్‌ కరోలీ బాబా లోకానికి తెలియజేశారు. వీటిని అనుసరించడం ద్వారా మనిషి ప్రశాంతంగా కూడా ఉండవచ్చని బాబా తెలిపారు.  ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఎప్పుడూ నమ్మకాన్ని కోల్పోవద్దు
నీమ్‌ కరోలీ బాబా చెప్పినదాని ప్రకారం మనిషి ఎంత కష్టసమయంలోనైనా ఆందోళనకు లోనుకాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.  కాలం ఎంత కఠినంగా ఉన్నా, ఏదో ఒకరోజు మార్పంటూ వస్తుంది. అందుకే ఎవరైనా విపత్కర పరిస్థితుల్లోనూ శాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ప్రతీ వ్యక్తీ.. ఈరోజు పరిస్థితులు బాగులేకపోయినా రేపు మంచి రోజులు వస్తాయనే నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. మనిషి భగవంతునిపై పూర్తి నమ్మకం ఉంచాలి.

డబ్బును సక్రమంగా వినియోగించాలి
ప్రతీ ఒక్కరూ డబ్బును సక్రమంగా వినియోగించాలి. అటువంటివారే ధనవంతులవుతారు. డబ్బు సంపాదించడంలోనే గొప్పదనం లేదని, దానిని సరిగా ఖర్చు చేయడంలోనే ఘనత ఉందన్నారు. ఇతరులను ఆదుకునేందుకు డబ్బును వెచ్చించాలి. అప్పుడే మనిషి దగ్గర ధనం నిలుస్తుంది. 

హనుమంతుని పూజించండి
నీమ్‌ కరోలీ బాబా హనుమంతునిపై తన భక్తిని చాటారు. బాబాను హనుమంతుని అవతారం అని కూడా అంటుంటారు. ఎవరైతే ‍ప్రతీరోజు హనుమంతుని పూజిస్తారో వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నీమ్‌ కరోలీ బాబా తెలిపారు. ప్రతీవ్యక్తి రోజూ హనుమాన్‌ చాలీసా పఠిస్తే ధైర్యం వస్తుందని బాబా బోధించారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top