విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు | complaint on student missing | Sakshi
Sakshi News home page

విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు

Mar 4 2017 10:40 PM | Updated on Nov 9 2018 4:31 PM

పట్టణంలోని జ్ఞానభారతి ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జశ్వంత్‌ అనే విద్యార్థి తప్పిపోయినట్లు తండ్రి లక్ష్మణమూర్తి శనివారం పట్టణ పోలీస్టేన్‌లో ఫిర్యాదు చేశారు.

కళ్యాణదుర్గం : పట్టణంలోని జ్ఞానభారతి ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జశ్వంత్‌ అనే విద్యార్థి తప్పిపోయినట్లు తండ్రి లక్ష్మణమూర్తి శనివారం పట్టణ పోలీస్టేన్‌లో ఫిర్యాదు చేశారు. గత బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ దూకి వెళ్లిపోయినట్లు అక్కడి వార్డెన్‌ తిప్పేస్వామి సమాచారం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణదుర్గం ప్రాంతంలో అన్వేషించినా ఆచూకీ లభించలేదన్నారు. తన కుమారుని అచూకీ కనుగొని న్యాయం చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement