సీఎం చంద్రబాబు వైఖరితోనే పచ్చటి సాగు భూములు ధ్వంసమై ఆహార, ఆర్థిక సంక్షోభం తలెత్తనుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు.
చంద్రబాబు వైఖరితో ఆహార సంక్షోభం
Aug 6 2016 9:12 PM | Updated on Oct 20 2018 4:36 PM
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు
చిలకలూరిపేట టౌన్: సీఎం చంద్రబాబు వైఖరితోనే పచ్చటి సాగు భూములు ధ్వంసమై ఆహార, ఆర్థిక సంక్షోభం తలెత్తనుందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 27వ మహాసభలు శనివారంతో ముగిశాయి. ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో అవినీతి, విధ్వంసక పాలన సాగుతుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు ఏకమై ప్రభుత్వ విధానాలకు ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement