విద్యుదాఘాతంతో చిన్నారి మృతి | Child electrocuted | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

Nov 5 2016 12:15 AM | Updated on Sep 4 2017 7:11 PM

విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

గూడూరు : అడుతూ పాడుతూ తిరిగే ఓ చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గూడూరు రెండో పట్టణంలోని అరవ దళితవాడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

గూడూరు : అడుతూ పాడుతూ తిరిగే ఓ చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గూడూరు రెండో పట్టణంలోని అరవ దళితవాడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నాగరాజు, పువ్వాయి దంపతుల రెండో కుమార్తె వైష్ణవి (9) మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు వీధులో ఆడుకుంటుంది. అక్కడే ఓ ఆటోకు పెయింట్‌ వేస్తున్న వారు విద్యుత్‌ పెయింట్‌ మిషన్‌ను ఆటో ఉంచారు. ప్రమాదశావత్తు పెయింట్‌ మిషన్‌కు ఉన్న విద్యుత్‌ వైర్లు స్లీవ్‌లు తెగి ఆటోకు అతుక్కోవడంతో ఆటోకి విద్యుత్‌ సరఫరా అవుతుంది. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ ఆటోను పట్టుకోవడంతో అక్కడక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement