కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్‌ | chicken wastage vehicle seize | Sakshi
Sakshi News home page

కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్‌

Aug 14 2016 9:11 PM | Updated on Aug 21 2018 5:54 PM

కోళ్ల వ్యర్థాల వాహనం  సీజ్‌ - Sakshi

కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్‌

పెదపాడు: కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని పెదపాడు పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

 పెదపాడు: కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని పెదపాడు పోలీసులు సీజ్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలపర్రు వైపు నుంజి వై.జంక్షన్‌ మీదుగా ఓ బొలోరో వాహనంలో కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో ఏఎస్సై సత్యనారాయణ సిబ్బందితో దాడి చేశారు. వై.జంక్షన్‌ వద్ద వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌ గుగ్గులోతు శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యర్థాలను తోటగూడెం వద్ద రామిలేరు గట్టుపై వేసి పూడ్చినట్టు పోలీసులు తెలిపారు. 
 
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement