breaking news
in pedapadu
-
కోళ్ల వ్యర్థాల వాహనం సీజ్
పెదపాడు: కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని పెదపాడు పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కలపర్రు వైపు నుంజి వై.జంక్షన్ మీదుగా ఓ బొలోరో వాహనంలో కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో ఏఎస్సై సత్యనారాయణ సిబ్బందితో దాడి చేశారు. వై.జంక్షన్ వద్ద వాహనాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ గుగ్గులోతు శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యర్థాలను తోటగూడెం వద్ద రామిలేరు గట్టుపై వేసి పూడ్చినట్టు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రస్థాయి బేస్బాల్ పోటీలు ప్రారంభం
పెదపాడు : రాష్ట్రస్థాయి బేస్బాల్ (సబ్ జూనియర్) పోటీలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బేస్బాల్ అసోసియేషన్ సంఘం అధ్యక్షతన పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మరడాని అచ్యుతరావును అభినందించారు. తొలిరోజు బాలుర విభాగంలో కర్నూలు జిల్లాపై నెల్లూరు జిల్లా జట్టు, కృష్ణాపై చిత్తూరు, తూర్పు గోదావరి జట్టుపై ప్రకాశం జట్టు, గుంటూరు జట్టుపై పశ్చిమ గోదావరి జిల్లా జట్టు 11–4 స్కోర్తోనూ విజయం సాధించాయి. ఎంపీపీ మోరు శ్రావణి, జెడ్పీటీసీ కూరపాటి మార్తమ్మ, నాయకులు బొప్పిడి కాశీబాబు, గుత్తా అనిల్, సర్పంచ్లు పాల్గొన్నారు.