రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు ప్రారంభం | stae level base ball games begin | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ పోటీలు ప్రారంభం

Aug 14 2016 12:23 AM | Updated on Sep 4 2017 9:08 AM

పెదపాడు : రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ (సబ్‌ జూనియర్‌) పోటీలు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రారంభించారు.

పెదపాడు :  రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ (సబ్‌ జూనియర్‌) పోటీలు స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రారంభమయ్యాయి. తొలుత ఈ పోటీలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి బేస్‌బాల్‌ అసోసియేషన్‌ సంఘం అధ్యక్షతన పాఠశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ మరడాని అచ్యుతరావును అభినందించారు. తొలిరోజు బాలుర విభాగంలో కర్నూలు జిల్లాపై నెల్లూరు జిల్లా జట్టు, కృష్ణాపై చిత్తూరు, తూర్పు గోదావరి జట్టుపై ప్రకాశం జట్టు, గుంటూరు జట్టుపై పశ్చిమ గోదావరి జిల్లా జట్టు 11–4 స్కోర్‌తోనూ విజయం సాధించాయి. ఎంపీపీ మోరు శ్రావణి, జెడ్పీటీసీ కూరపాటి మార్తమ్మ, నాయకులు బొప్పిడి కాశీబాబు, గుత్తా అనిల్, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement