గొర్రెను చంపిన చిరుత | cheatah attacks sheep | Sakshi
Sakshi News home page

గొర్రెను చంపిన చిరుత

Feb 2 2017 11:31 PM | Updated on Sep 5 2017 2:44 AM

కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో నల్లప్ప అనే రైతుకు చెందిన గొర్రెను ఓ చిరుత గురువారం చంపేసింది.

కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గం మండలం మల్లాపురంలో నల్లప్ప అనే రైతుకు చెందిన గొర్రెను ఓ చిరుత గురువారం చంపేసింది. కళ్యాణదుర్గం సమీపంలోని వన్నూరుస్వామి కొండ వెనుక భాగంలో ఈ ఘటన జరిగింది. గొర్రెలను మేపుకుని వచ్చేందుకు కొండ వద్దకు వెళ్లగా అనూహ్యంగా చిరుత మందపై దాడిచేసి గొర్రెను ఎత్తుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అటవీ శాఖ అధికారిణి రామేశ్వరి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కాగా అదే గ్రామానికి చెందిన మరో రైతు గొర్రెను రెండ్రోజుల కిందట చిరుత చంపేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో ఆయా గ్రామస్తులతో పాటు పశువుల కాపరులు అటువైపు మందను తోలుకెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement