చిరుతదాడిలో ఐదు మేకలు మృతి | five goats dies of cheatah attacks | Sakshi
Sakshi News home page

చిరుతదాడిలో ఐదు మేకలు మృతి

Aug 11 2017 9:50 PM | Updated on Sep 17 2017 5:25 PM

చిరుతదాడిలో ఐదు మేకలు మృతి

చిరుతదాడిలో ఐదు మేకలు మృతి

కోడిగానిపల్లిలో కొట్టంలో కట్టేసిన మేకలపై శుక్రవారం తెల్లవారుజామున చిరుత దాడి చేసింది.

మడకశిర రూరల్‌: కోడిగానిపల్లిలో కొట్టంలో కట్టేసిన మేకలపై శుక్రవారం తెల్లవారుజామున చిరుత దాడి చేసింది. పెంపకందారురాలు హనుమక్క శబ్దం విని కేకలు వేసుకుంటూ అక్కడికి వచ్చేసరికి అప్పటికి ఐదు మేకల చిరుతదాడిలో చనిపోయాయి. మరొక మేకను తీసుకుని చిరుత పరుగులు తీసింది. దాదాపు రూ.30వేల నష్టం వాటిల్లిందని బాధితురాలు వాపోయింది.

అటవీశాఖ, వెటర్నరీ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీంచి మృతి చెందిన మేకలకు శవపరీక్ష నిర్వహించారు. నష్టపరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక పంపుతామని అటవీ శాఖాధికారి శాంప్లానాయక్‌ తెలిపారు. గ్రామాల్లోకి వన్యప్రాణులు ప్రవేశించకుండా అటవీశాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సర్పంచు సావిత్రి, ఎంపీటీసీ సభ్యుడు రామప్ప కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement