కాళేశ్వరం ప్రాజెక్ట్ సొరంగంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది.
కాళేశ్వరం సొరంగంలో మరో ప్రమాదం
Sep 21 2017 12:33 PM | Updated on Oct 30 2018 7:50 PM
	పెద్దపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్ సొరంగంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం బండరాళ్లు మీదపడి ఓ కూలీ మృతిచెందాడు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపురం వద్ద ప్రాజెక్ట్ సొరంగంలో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు బండరాళ్లు పడ్డాయి. ఈ ప్రమాదంలో అసోంకు చెందిన దేవజిత్ అనే కూలీ మృతి చెందాడు. 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	కాగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద ప్రాజెక్టు టన్నెల్ మార్గంలో పని జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించి ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
