‘బాబూ’ ఇదేమి ద్వంద్వ నీతి | chandrababu sabha ..school buses use | Sakshi
Sakshi News home page

‘బాబూ’ ఇదేమి ద్వంద్వ నీతి

Dec 29 2016 11:43 PM | Updated on Sep 15 2018 4:05 PM

‘గురివింద తన నలుపెరగదన్న’ సామెత చందంగా ఉంది చంద్రబాబు సర్కార్‌ నీతి. తన సొంత సభలకు విద్యార్థులను పెద్ద ఎత్తున తరలించడం..విద్యా సంస్థలకు చెందిన బస్సులను య«థేచ్ఛగా వాడుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ఇదే సమయంలో రాష్ట్ర

  •  ‘మోరి’ సభకు విద్యాసంస్థల బస్సులు  
  • యువభేరికి బస్సులు పంపితే నోటీసులా
  • కాకినాడ, సాక్షి ప్రతినిధి : 
    ‘గురివింద తన నలుపెరగదన్న’ సామెత చందంగా ఉంది చంద్రబాబు సర్కార్‌ నీతి. తన సొంత సభలకు విద్యార్థులను పెద్ద ఎత్తున తరలించడం..విద్యా సంస్థలకు చెందిన బస్సులను య«థేచ్ఛగా వాడుకోవడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ఇదే సమయంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం, విద్యార్థుల ఉజ్వల భవిత కోసం ప్రతి పక్షనేత నిర్వహించిన యువభేరి సదస్సుకు ఒక గంటపాటు విద్యార్థులు వెళ్లడం..బస్సులను అద్దెకు తీసుకోవడాన్ని మాత్రం తప్పుపడుతూ విద్యా సంస్థలకు నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా మారింది. ఇటీవల విజయనగరం జిల్లాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగ¯ŒSమోహ¯ŒS రెడ్డి నిర్వహించిన యువభేరికి విద్యార్థులు కళాశాల బస్సుల్లో పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కన్నుకుట్టిన చంద్రబాబు ఆయా కాలేజీల యాజమాన్యాలకు నోటీసులు ఇప్పించడం పట్ల ప్రజా స్వామ్యవాదులు ముక్కున వేలేసుకున్నారు.
    మరి దీనికేమంటారో...
    విజయనగరంలో యువభేరికి వచ్చిన కళాశాల బస్సులకు నోటీసులు ఇప్పించిన చంద్రబాబు మరి గురువారం జిల్లాలో మోరి పర్యటనను విజయవంతం చేసేందుకు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద కసరత్తే చేశారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా ప్రైవేట్‌ విద్యా సంస్థలకు చెందిన బస్సుల్లో తాను నిర్వహించే బహిరంగ సభకు జనాన్ని, ముఖ్యంగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలను తరలించేందుకు వినియోగించారు. రాజోలు, మలికిపురం, మామిడికుదురు, పి.గన్నవరం సహా కోనసీమలోని పలు మండలాల నుంచి ప్రైవేట్‌ విద్యాసంస్థలకు చెందిన బస్సుల్లో   జనాన్ని తరలించారు. ఇందుకోసం ఆయా విద్యాసంస్థల యాజమాన్యంపై పలు శాఖల అధికారుల ద్వారా పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఈ ఏడాది రాజమహేంద్రవరం, కాకినాడ తదితర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించిన పలు సందర్భాలలో స్కూళ్లు బస్సులను వినియోగించారు. అటువంటిది ఈ నెలలో విజయనగరంలో జరిగిన యువభేరి సదస్సుకు కళాశాలలకు విద్యార్థులు స్వచ్ఛందంగా వెళ్లడాన్ని బాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోయింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement