జనం..రోజులు లెక్క పెడుతున్నారు | chandra Babu guarantees cheater | Sakshi
Sakshi News home page

జనం..రోజులు లెక్క పెడుతున్నారు

Mar 18 2017 3:39 AM | Updated on Aug 9 2018 4:43 PM

జనం..రోజులు లెక్క పెడుతున్నారు - Sakshi

జనం..రోజులు లెక్క పెడుతున్నారు

అబద్ధాలు చెప్పి సీఎం కుర్చీ ఎక్కిన చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడా అని రైతులు, మహిళలు రోజులు లెక్క

బాబు హామీల మోసగాడు 
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి


కురబలకోట: అబద్ధాలు చెప్పి సీఎం కుర్చీ ఎక్కిన చంద్రబాబు ఎప్పుడు దిగిపోతాడా అని  రైతులు, మహిళలు రోజులు లెక్క పెడుతున్నారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మండలంలోని ముదివేడు పం చాయతీలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు. తూపల్లెలో ఆయన  విలేకరులతో మాట్లాడుతూ బాబు సీఎం అయి మూ డేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఒక్క హామీ ని కూడా నెరవేర్చలేదన్నారు. రుణమాఫీ చేస్తారని నమ్మి ఓట్లేసిన రైతులు,  బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోయి మహిళలు అప్పులపాలయ్యారన్నారు.

సంక్షేమ పథకాల ఊసే లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు జాబ్‌ లేకున్నా కొడుకు లోకేష్‌ను మాత్రం ఎమ్మెల్సీ చేసుకున్నారని విమర్శించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు జగన్‌ మోహన్‌రెడ్డి, చంద్రబాబుకు ఉన్న తేడా ను  గుర్తించారన్నారు. అంతేగాకుండా చంద్రబాబుకు ఎమ్మెల్యే రోజా కాళీ మాతలా కన్పిస్తోందని తెలిపారు. రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే అభివృద్ధిలో దూసుకుపోతోందని అసెంబ్లీలో అసత్య ప్రసంగం చేయించారన్నారు. పార్టీ రాష్ట్ర నాయకుడు రెడ్డి శేఖర్‌రెడ్డి, జిల్లా నాయకులు బైసాని చంద్రశేఖర్‌రెడ్డి, బాబ్‌జాన్, కన్వీనర్‌ డి.ఆర్‌.ఉమాపతిరెడ్డి, పెద్దపల్లె శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement