విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఈనెల 14 నుంచి 18 వరకు నిరాహార దీక్షలు, 19న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమ వాల్‌పోస్టర్లను మంగళవారం స్థానిక 11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఐక్య విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు విడుదల చేశారు.
పోరుమామిళ్ల: విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఈనెల 14 నుంచి 18 వరకు నిరాహార దీక్షలు, 19న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమ వాల్‌పోస్టర్లను మంగళవారం స్థానిక 11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఐక్య విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ రెగ్యులరైజేషన్, సమానపనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్ల సాధనకు దశలవారి పోరాటం మొదలయిందన్నారు. కాంట్రాక్టు కార్మికులం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి గెలిచాక అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులే లేరని అబద్దాలు చెప్పారన్నారు. విద్యుత్ యాజమాన్యం కోర్టు తీర్పులను కూడా లెక్క చేయడం లేదన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నవారిని అక్రమంగా తొలగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు నౌషాద్, నబీ, రంగస్వామి, నారాయణ, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు.