breaking news
December 19
-
చలో విజయవాడ పోస్టర్లు విడుదల
పోరుమామిళ్ల: విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ఈనెల 14 నుంచి 18 వరకు నిరాహార దీక్షలు, 19న చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమ వాల్‌పోస్టర్లను మంగళవారం స్థానిక 11 కేవీ సబ్‌స్టేషన్ వద్ద ఐక్య విద్యుత్ కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం డివిజన్ కార్యదర్శి సురేష్ మాట్లాడుతూ రెగ్యులరైజేషన్, సమానపనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత తదితర డిమాండ్ల సాధనకు దశలవారి పోరాటం మొదలయిందన్నారు. కాంట్రాక్టు కార్మికులం ఎన్నికల ముందు కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పి గెలిచాక అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ సంస్థలో కాంట్రాక్టు కార్మికులే లేరని అబద్దాలు చెప్పారన్నారు. విద్యుత్ యాజమాన్యం కోర్టు తీర్పులను కూడా లెక్క చేయడం లేదన్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నవారిని అక్రమంగా తొలగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు నౌషాద్, నబీ, రంగస్వామి, నారాయణ, నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
ఎవడు రెడీ
ఇంతకూ ఇతను ‘ఎవడు’? కథ రీత్యా ఇందులో ప్రతినాయకునికి ఈ ప్రశ్నే అడుగడుగునా వెంటాడుతుందట. చూస్తున్న ప్రేక్షకుణ్ణి కూడా ఈ ప్రశ్నే కలవరపెడతుందట. అంతటి పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమా సాగుతుందని సమాచారం. రామ్‌చరణ్ కథానాయకునిగా నటించిన ఈ చిత్రంలో బన్నీ ఓ ప్రత్యేక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇందులో బన్నీ, చరణ్‌ల పాత్రల మధ్య ఉండే అనుబంధం చాలా ఆసక్తికరంగా ఉంటుందని విశ్వసనీయ సమాచారం. హాలీవుడ్ సినిమాను తలపించేలా దర్శకుడు పైడిపల్లి వంశీ ఈ చిత్రాన్ని మలిచారని తెలిసింది. డిసెంబర్ 19న ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ‘దిల్’రాజు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ‘‘మెగా అభిమానులకు ఈ సినిమా విందుభోజనం లాంటిది. రామ్‌చరణ్ నటన, శ్రుతిహాసన్, అమీజాక్సన్ అందచందాలు, దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలాలు. పైడిపల్లి వంశీ విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని మలిచాడు. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేయనున్నాం’’ అని తెలిపారు. మరో ప్రత్యేక పాత్రలో కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రంలో జయసుధ, కోట శ్రీనివాసరావు, సాయికుమార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ: పైడిపల్లి వంశీ, వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్ : ఆనంద్‌సాయి, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, సమర్పణ: శ్రీమతి అనిత.