బతుకమ్మ ఉత్సవాల ఘనత ఎంపీ కవితదే!
బంగారు బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణలో క్షేత్ర స్థాయిలోకి తీసు కెళ్లడమే గాక, వివిధ దేశాలకు తీసుకెళ్లి అక్కడ నిర్వహించడంతో ఎంపీ కవిత చరిత్రలో నిలిచిపోయార
వినాయక్‌నగర్ :
బంగారు బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణలో క్షేత్ర స్థాయిలోకి తీసు కెళ్లడమే గాక, వివిధ దేశాలకు తీసుకెళ్లి అక్కడ నిర్వహించడంతో ఎంపీ కవిత చరిత్రలో నిలిచిపోయారని టీఆర్‌స్ జిల్లా అధ్యక్షులు ఈగ గంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంతో పాటు, జిల్లా వాప్తంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంగారు ఉబతుకమ్మ సంబరాల్లో ప్రతి ఆడ పడుచూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. నగరంలోని పలు ప్రధాన కూడళ్లు, పలు మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో జాగృతి జిల్లా అధ్యక్షులు లక్ష్మినారాయణ భరద్వజ్, నగర అధ్యక్షులు కొళవి అనిల్ కుమార్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు నలమాస శ్రీకాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భిక్షపతి, రవీందర్‌రెడ్డి, కుల్‌దీప్ కుమార్, గణేశ్, క్రాంతి, సాయి, అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.