'అసదుద్దీన్‌ను చంకనెత్తుకోవడం సరికాదు'


నాగారం: దేశాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చంకనెత్తికున్నాడని కేంద్ర ఎరువులు, రసాయనాల సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ విమర్శించారు. ప్రతి ఒక్కరూ దేశాన్ని గౌరవించాలనీ, భారత్ మాతాకు జై అనాల్సిందేనని అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు ఎక్కువ మొత్తంలో రాయితీలు ఉన్నాయని, ప్రచారం అంతగా లేకపోవడంతో ప్రజలకు తెలియడం లేదన్నారు. గోధుమలకు 27 శాతం కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. ఒక్కశాతమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని, దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంతా తామే చేస్తున్నామని గొప్పలు చేప్పుకోవడం విడ్డూరమన్నారు.


 


ఆదిలాబాద్ జిల్లాలో 1700 ఎకరాల్లో పెద్ద ఎత్తున సీమెంట్ ఫ్యాక్టరీనీ నిర్మాణించడాకి కషి చేస్తున్నామన్నారు. రామగుండంలో ఫ్యాక్టరీకి రూ. 5 వేల కోట్లు మంజురు చేశామన్నారు. దేశంలోని రోడ్లపై గల రైల్వే లైన్‌పై ఆర్‌ఓబీ బ్రీడ్జీలు నిర్మిస్తున్నామన్నారు. ప్రధాన రహదారులను అభివద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా కరీంనగర్ నుంచి నారాయాణపేట్ రహదారికి రూ. 1900 కోట్లు కేంద్ర మంత్రి గడ్కరీ మంజూరు చేశారని, మరో రూ. 160 కోట్లతో రహదారులు అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అమృత సిటీ పథకంలో నిజామాబాద్ నగరం ఉందన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో ఇందుర్ అభివృద్ధి చెందుతుందన్నారు. సురక్షిత త్రాగునీరు అందిస్తామన్నారు. నిరుద్యోగ యువతకు స్కిల్‌డెవలప్‌మెంట్ ద్వారా 50 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిని అమలు చేయడం లేదన్నారు. బోధన్ షుగర్‌ఫ్యాక్టరీ ప్రయివేటీకరణకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top