ఘనంగా తీజ్‌ పండుగ | celebrating grand teez festival | Sakshi
Sakshi News home page

ఘనంగా తీజ్‌ పండుగ

Jul 24 2016 12:47 AM | Updated on Apr 7 2019 4:37 PM

ఘనంగా తీజ్‌ పండుగ - Sakshi

ఘనంగా తీజ్‌ పండుగ

మండలంలోని నీమానాయక్‌ తండాలో శనివారం తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. తండాలో పెళ్లిళ్లు కాని యువతులు, బాలికలు ఇంటికొక తీజ్‌ బుట్టను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఉంచి ఉపవాస దీక్షలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్దవూర: మండలంలోని నీమానాయక్‌ తండాలో శనివారం తీజ్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. తండాలో పెళ్లిళ్లు కాని యువతులు, బాలికలు ఇంటికొక తీజ్‌ బుట్టను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దెపై ఉంచి ఉపవాస దీక్షలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరి బుట్టలో ఎక్కువ మొలకలు వస్తాయో వారి కోర్కెలు ఫలిస్తాయని గిరిజనుల నమ్మకం. తీజ్‌ బుట్టలతో తండాలో డప్పులతో గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించి రామాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం బావిలో నిమజ్జనం చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement