దేశం’ వ్యతిరేకులపై కేసుల | cases filed on kapu leaders | Sakshi
Sakshi News home page

దేశం’ వ్యతిరేకులపై కేసుల

Feb 4 2016 2:41 AM | Updated on Aug 10 2018 8:16 PM

కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై అధికార తెలుగుదేశం పార్టీ పోలీసుల చేత.......

 తుని/కిర్లంపూడి : కాపు ఐక్యగర్జన సందర్భంగా చోటు చేసుకున్న సంఘటనలపై అధికార తెలుగుదేశం పార్టీ పోలీసుల చేత పెట్టించే కేసులకు భయపడాల్సిన అవసరం లేదని కాపు ఉద్యమసారథి, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేర్కొన్నారు. టీడీపీకి గతంలో శత్రువులుగా ఉన్న నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించాలని యనమల సోదరులు పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. సంబంధం లేని వ్యక్తులపై అక్రమ కేసులు బనాయిస్తే మరో ఉద్యమం చేస్తానని హెచ్చరించారు. ఎవరికీ భయపడవద్దని, తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.ఐక్యగర్జనకు సహకరించిన వారికి రుణపడి ఉంటా.. గత నెల 31న వెలమ కొత్తూరు వద్ద కాపు ఐక్యగర్జన సభ నిర్వహణకు స్థలం ఇచ్చిన రాజా చినబాబుకు ముద్రగడ బుధవారం కృతజ్ఞతలు తెలిపారు.

తునిలోని చినబాబు ఇంటి వద్ద మాట్లాడుతూ  కాపు జాతి కోసం నిర్వహించిన సభకు సహకరించిన అందరికీ రుణపడి ఉంటానన్నారు. నెల రోజుల పాటు సభ కోసం కష్టపడి పనిచేసిన వారికి హృదయ పూర్వక అభినందనలు చెప్పారు. తుని నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందించిన సహకారం మరువలేనిదన్నారు. అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరించారు.
 మీడియా సోదరులపై దాడి సరి కాదు..కాపు ఐక్యగర్జన సభ సందర్భంగా జరిగిన సంఘటనల్లో మీడియా సోదరులపై దాడి చేయడం సరికాదని ముద్రగడ అన్నారు.

ఆ రోజు జరిగిన దానికి తాను క్షమాపణలు చెబుతున్నానని, మంచి మనసుతో స్వీకరించాలని కోరారు. నాయకులు గుండా వెంకటరమణ, వాసిరెడ్డి ఏసుదాసు, నీలగిరి చిట్టిబాబు, పెంటకోట నాగు, జి. లక్ష్మణరావు, రాంబాబు, గోపు చంటి బాబు, లోవ దేవస్థానం మాజీ ఛైర్మన్ దూలం మాణిక్యం, నరిశే శివగణేష్, మాకినీడి గాంధీ, కుసనం దొరబాబు ముద్రగడ వెంట ఉన్నారు.రాష్ర్టంలో అల్లకల్లోలానికి సర్కారు కుట్ర రాష్ర్టంలో అల్లకల్లోలం సృష్టించటానికి ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నుతోందని, ప్రభుత్వం పెద్దల సహకారంతోనే ఐక్యగర్జన సందర్భంగా విధ్వంసకాండకు పూనుకున్నారని ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. బుధవారం సాయంత్రం స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ చంద్రబాబు మీ అనుచరులు ఆడిన  ఆటలు ఆపండి. గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. ఇచ్చిన హామీలనే అడుగుతున్నాం.

గురువారం సాయంత్రంలోగ జీవో ఇవ్వకపోతే శుక్రవారం ఉదయం 9గంటలకు నా భార్యతో సహా ఆమరణ నిరాహారదీక్షకు దిగుతాను’ అని  స్పష్టం చేశారు. ఎవరెన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని వేల మందిని జైల్లో పెట్టినా వెనకంజవేయబోమన్నారు.   దీక్ష సమయంలో గన్‌తో పేల్చుకుంటానని ఆరోపణలు చేస్తున్నారని, రివాల్వర్‌ను, గన్‌ను జగ్గంపేట సీఐకి అప్పగించానని చెప్పారు. దీక్షా సమయంలో తనకు సంఘీబావం తెలిపేందుకు ఎవరు రావద్దని, తమ గ్రామాలలోనే ఇళ్లముందు నిల్చుని గంటసేపు  ప్లేట్‌పై శబ్దం చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement