పత్రికా విలేఖరిపై కేసు నమోదు | case on reporter | Sakshi
Sakshi News home page

పత్రికా విలేఖరిపై కేసు నమోదు

Jul 28 2016 11:29 PM | Updated on Sep 4 2017 6:46 AM

పత్రికా విలేఖరిపై కేసు నమోదు

పత్రికా విలేఖరిపై కేసు నమోదు

ఖమ్మం క్రైం: వార్తలు రాస్తానని బెదిరించి ఓ వ్యక్తి నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకున్న విలేకరిపై టూటౌన్‌ పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు.

ఖమ్మం క్రైం: వార్తలు రాస్తానని బెదిరించి ఓ వ్యక్తి నుంచి బలవంతంగా డబ్బులు గుంజుకున్న విలేకరిపై టూటౌన్‌ పోలీసులు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. సీఐ మడత రమేష్‌ తెలిపిన ప్రకారం.. నగరంలో ఒక దినపత్రిక విలేకరిగా పనిచేస్తున్న మురళీకృష్ణ, నెహ్రూనగర్‌కు చెందిన గోనా గోపాల్‌రావు అనే వ్యక్తిపై వార్త రాశాడు. గోపాల్‌ రావుకు ఆ విలేకరి ఫోన్‌ చేసి, ‘‘లక్షన్నర రూపాయలు ఇవ్వకపోతే మళ్లీ వార్త రాస్తా’’నని బెదిరించాడు. తాను ఓ మెస్‌ వద్ద ఉన్నానని, అక్కడికి రావాలని చెప్పాడు. దీంతో గోపాల్‌రావు, తన స్నేహితుడైన నరేష్‌తో కలిసి అక్కడకు వెళ్లాడు. ఆయన జేబులోగల 60వేల రూపాయలను మురళీకృష్ణ లాక్కుని, శుక్రవారంలోగా మరో 90వేల రూపాయలు ఇవ్వాలని బెదిరించాడు. బాధితుడు టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుతో మురళీకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement