ఎండకు.. కోర్టు ప్రాంగణంలో కారు దగ్ధం! | Car burnt infront of court province | Sakshi
Sakshi News home page

ఎండకు.. కోర్టు ప్రాంగణంలో కారు దగ్ధం!

May 25 2016 4:03 AM | Updated on Sep 4 2017 12:50 AM

ఎండకు.. కోర్టు ప్రాంగణంలో కారు దగ్ధం!

ఎండకు.. కోర్టు ప్రాంగణంలో కారు దగ్ధం!

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని న్యాయస్థానముల సముదాయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఎండవేడిమికి కారు దగ్ధమైంది.

కామారెడ్డి: నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలోని  న్యాయస్థానాల సముదాయ ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఎండవేడిమికి కారు దగ్ధమైంది. న్యాయవాది జయప్రకాశ్ రెండు నెలల క్రితం కొన్న హుందాయ్ ఇయాన్ కారును కోర్టు ప్రాంగణంలోని ఓ షెడ్డు కింద పార్కింగ్ చేసి వెళ్లాడు. ఈ క్రమంలో ఎండకు కారు నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్ వచ్చి మంటలను ఆర్పింది. అయితే అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. పెట్రోల్, ఎల్‌పీజీతో నడిచే కారు కావడంతో ఎండల తీవ్రతకు దగ్ధమై ఉండొచ్చని స్థానికులంటున్నారు.           
  - కామారెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement