హ్యుందాయ్‌ వెన్యూ సరికొత్త వెర్షన్‌ | New Hyundai Venue launched at Rs 7. 89 lakh | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్‌ వెన్యూ సరికొత్త వెర్షన్‌

Nov 5 2025 2:29 AM | Updated on Nov 5 2025 7:01 AM

New Hyundai Venue launched at Rs 7. 89 lakh

ధర రూ. 7.89 లక్షల నుంచి ప్రారంభం

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌ దిగ్గజం హ్యుందాయ్‌ తాజాగా తమ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ వెన్యూకి సంబంధించిన కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 7.89 లక్షలనుంచి ప్రారంభమవుతుంది. లేటెస్ట్‌ వెన్యూని అభివృద్ధి చేయడంపై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు, పుణేలో కొత్తగా ప్రారంభించిన ప్లాంటులో మాత్రమే దీన్ని ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది. 2028 నాటికి ఈ ప్లాంటు స్థాపిత సామర్థ్యం 2.5 లక్షల యూనిట్లుగా ఉంటుందని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్, వచ్చే ఏడాది జనవరిలో ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న తరుణ్‌ గర్గ్‌ తెలిపారు.

ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వెన్యూ వాహనాలను విక్రయించినట్లు చెప్పారు. దేశీయంగా కస్టమర్లు చిన్న కార్లకు తగ్గకుండా కాంపాక్ట్‌ ఎస్‌యూవీలకు అప్‌గ్రేడ్‌ అవుతున్నారని గర్గ్‌ చెప్పారు. తమ మొత్తం అమ్మకాల్లో ఎస్‌యూవీల వాటా 71 శాతంగా ఉందని, 2030 నాటికి ఇది 80 శాతానికి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. 2030 నాటికి రూ. 45,000 కోట్ల పెట్టుబడులతో, 26 కార్లను ప్రవేశపెట్టాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement