హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ వచ్చేసింది.. | Hyundai Creta Summer Edition Launched | Sakshi
Sakshi News home page

హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ వచ్చేసింది..

Apr 9 2026 1:20 PM | Updated on Apr 9 2026 1:27 PM

Hyundai Creta Summer Edition Launched

భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా, తాజాగా తన పాపులర్ ఎస్‌యూవీ క్రెటాలో 'సమ్మర్ ఎడిషన్' (Creta Summer Edition)ను లాంచ్ చేసింది. వేసవి కాలానికి సరికొత్త హంగులతో వచ్చిన ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధరను కంపెనీ రూ. 12.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది.

వేరియంట్లు, ధరల వివరాలు
ఈ సమ్మర్ ఎడిషన్ ప్రధానంగా ఎంట్రీ లెవల్ EX ట్రిమ్ నుండి టాప్-ఎండ్ SX ట్రిమ్ వరకు అందుబాటులో ఉంటుంది. ప్రారంభ ధర రూ. 12.06 లక్షలు (EX వేరియంట్) కాగా టాప్-ఎండ్ ధర రూ. 17.89 లక్షలు (SX ట్రిమ్). ఇవే కాకుండా S(O), S(O) నైట్ (Knight) ట్రిమ్‌లలో కూడా ఈ సమ్మర్ ఎడిషన్ లభిస్తుంది.

కొత్తగా చేరిన ఫీచర్లు ఇవే!
డిజైన్ పరంగా ప్రామాణిక మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కస్టమర్లను ఆకట్టుకోవడానికి హ్యుందాయ్ ఇందులో పలు అదనపు ఫీచర్లను జోడించింది.

EX (O) వేరియంట్: ఇందులో 16-అంగుళాల డ్యూయల్-టోన్ స్టీల్ వీల్స్, స్మార్ట్ కీ, పుష్-బటన్ స్టార్ట్, క్వాడ్ బీమ్ ఎల్‌ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్‌ఈడీ టెయిల్ ల్యాంప్స్, పొజిషనింగ్ ల్యాంప్‌లు ఉన్నాయి. అదనంగా రియర్ విండో సన్‌షేడ్, డైనమిక్ గైడ్‌లైన్స్‌తో కూడిన రియర్ కెమెరా సౌకర్యం ఉంది.

S(O) & S(O) నైట్ ఎడిషన్: ఈ వేరియంట్లలో భద్రత కోసం డాష్ క్యామ్ (Dashcam)ను ప్రత్యేకంగా అందించారు. అలాగే 10.25 అంగుళాల మల్టీ-డిస్‌ప్లే డిజిటల్ క్లస్టర్ కూడా ఆకర్షణగా నిలుస్తుంది.

SX ప్రీమియం: టాప్ వేరియంట్‌లో సరౌండ్ వ్యూ మానిటర్ (SVM), బ్లైండ్-స్పాట్ వ్యూ మానిటర్ (BVM), ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ల వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్, పెర్ఫార్మెన్స్
హ్యుందాయ్ క్రెటా సమ్మర్ ఎడిషన్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అవి 1.5-లీటర్ MPI పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్. అయితే, ఈ స్పెషల్ ఎడిషన్‌లో టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్‌ను కంపెనీ అందించడం లేదు. ట్రాన్స్‌మిషన్ పరంగా చూస్తే, కస్టమర్లు తమ అవసరానికి తగ్గట్టుగా MT (మాన్యువల్), iVT, AT (ఆటోమేటిక్) గేర్‌బాక్స్ ఎంపికలను ఎంచుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement