వరంగల్ జిల్లా వర్దన్నపేట సమీపంలోని ఆకేరు వాగు వంతెనపై శనివారం వేకువజామున ప్రమాదం సంభవించింది.
ఆకేరు వంతెనపై కారు ప్రమాదం
Oct 8 2016 11:31 AM | Updated on Aug 14 2018 3:22 PM
వరంగల్: వరంగల్ జిల్లా వర్దన్నపేట సమీపంలోని ఆకేరు వాగు వంతెనపై శనివారం వేకువజామున ప్రమాదం సంభవించింది. సిద్దిపేట వైపు వెళ్తున్న కారు వేగంగా వచ్చి వంతెన రైలింగ్‌ను, అదే స్పీడ్‌తో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రెండు వాహనాలు వంతెనపైనే నిలిచిపోవటంతో ట్రాఫిక్ స్తంభించింది. వాహనాలను క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. క్షతగాత్రులు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వారిగా భావిస్తున్నారు.
Advertisement
Advertisement