బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ టోకరా | call from bank some one fraud | Sakshi
Sakshi News home page

బ్యాంక్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ టోకరా

Aug 15 2016 1:19 AM | Updated on Sep 4 2017 9:17 AM

ఆంధ్రాబ్యాంక్‌ హెడ్డాఫీస్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ..కూసుమంచికి చెందిన కూరపాటి న రేష్‌ అనే యువకుడికి ఒకరు ఫోన్‌ చేసి..అతని ఏటీఎం బార్‌ కోడ్‌తెలుసుకొని..రూ.5వేలను డ్రా చేసుకున్నారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

  • బార్‌కోడ్‌ తెలుసుకొని రూ.5వేలు డ్రా 
  • కూసుమంచి: ఆంధ్రాబ్యాంక్‌ హెడ్డాఫీస్‌ నుంచి మాట్లాడుతున్నానంటూ..కూసుమంచికి చెందిన కూరపాటి న రేష్‌ అనే యువకుడికి ఒకరు ఫోన్‌ చేసి..అతని ఏటీఎం బార్‌ కోడ్‌తెలుసుకొని..రూ.5వేలను డ్రా చేసుకున్నారు. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఓ వ్యక్తి నరేష్‌ సెల్‌కు ఫోన్‌చేసి హిందీలో మాట్లాడాడు. తాను ఆంధ్రాబ్యాంకు హెడ్డాఫీస్‌ నుంచి మాట్లాడుతున్నానని, మీ ఏటీఎం ఇకపై పనిచేయదని, బార్‌కోyŠ  నెంబర్‌ చెబితే సరిచేస్తామని నమ్మబలికాడు. దీంతో సదరు యువకుడు..తొలుత ఏటీఎం కార్డుపై ఉన్న 16 అంకెల బార్‌కోడ్‌ చెప్పాడు. దీంతో నరేష్‌ సెల్‌కు ఐదు నిమిషాల్లోనే రూ. 5వేలు డ్రా అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో ఖంగుతిన్న బాధితుడు బ్యాంక్‌కు వెళ్లి బ్యాలెన్స్‌ చూసుకోగా రూ. 11 వేలకు బదులు రూ. 6వేలే ఉన్నాయి. తాను మోసపోయానని గ్రహించి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement