అబద్ధాల బాబు: సి.రామచంద్రయ్య | C. Ramachandraiah fires on CM Chandrababu | Sakshi
Sakshi News home page

అబద్ధాల బాబు: సి.రామచంద్రయ్య

Jan 9 2016 3:57 AM | Updated on Aug 14 2018 11:24 AM

అబద్ధాల బాబు: సి.రామచంద్రయ్య - Sakshi

అబద్ధాల బాబు: సి.రామచంద్రయ్య

అబద్ధాలతో 19 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్: అబద్ధాలతో 19 నెలలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారని శాసన మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య ఆరోపించారు. ఇందిర భవన్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కులాలు, పార్టీల వారీగా విభజించి పాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించినట్లుగా గతంలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదుల్లో 96 శాతం పరిష్కరించినట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. నిరూపించకపోతే ముఖ్యమంత్రి రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement