నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు | Busting a gang of fake currency | Sakshi
Sakshi News home page

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

Feb 10 2017 3:02 AM | Updated on Jul 10 2019 2:44 PM

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు - Sakshi

నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు నకిలీ నోట్ల కరెన్సీని ముద్రించిన ఇద్దరు వ్యాపారులతో పాటు వాటిని చలామణి చేస్తున్న ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను సైబరాబాద్‌ పోలీసులు

అప్పుల బాధ నుంచి బయట పడేందుకు నకిలీ నోట్ల ముద్రణ
ఇద్దరు వ్యాపారులు, ఇద్దరు బీటెక్‌ విద్యార్థుల అరెస్టు

హైదరాబాద్‌: అప్పుల ఊబి నుంచి బయటపడేందుకు నకిలీ నోట్ల కరెన్సీని ముద్రించిన ఇద్దరు వ్యాపారులతో పాటు వాటిని చలామణి చేస్తున్న ఇద్దరు బీటెక్‌ విద్యార్థులను సైబరాబాద్‌ పోలీసులు గురువా రం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువ చేసే నకిలీ నోట్లతో పాటు కలర్‌ ప్రింటర్‌ కమ్‌ స్కానర్‌ కమ్‌ జిరాక్స్‌ మెషీన్, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి వెల్లడించారు. బోయిన్‌పల్లికి చెందిన బంగారం వ్యాపారి విజయ్‌ శర్మ, హిమాయత్‌నగర్‌కు చెందిన బజాజ్‌ క్యాపిటల్‌ సేల్స్‌ అసోసియే ట్‌గా పనిచేసే మోతేశ్యామ్‌ అలీఖాన్‌ మంచి స్నేహితులు. వ్యాపారంలో నష్టాలు ఎదుర వడంతో పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. వాటిని తీర్చేందుకు కొత్త రెండు వేల నోట్లు జిరాక్స్‌ తీసి చలామణి చేస్తే తమ కష్టాలు తీరుతాయని భావించారు. విజయ్‌శర్మ కలర్‌ ప్రింటర్‌ కమ్‌ స్కానర్‌ కమ్‌ జిరాక్స్‌ మెషీన్, ఏ4 పేపర్స్‌ బండిల్స్‌ను కొనుగోలు చేశాడు.

 తన ఇంట్లో అలీఖాన్‌తో కలసి 18 కొత్త 2 వేల రూపాయల నోట్లతో ఒకే రోజులో రూ.35 లక్షల విలువ చేసే రూ.2వేల నోట్లను కలర్‌ జిరాక్స్‌ తీశారు. ఇందులో రూ.22 లక్షల నకిలీ నోట్లను అలీఖాన్‌కు ఇచ్చి అప్పు లు క్లియర్‌ చేసుకోమని సూచిం చాడు. అయితే ఈ డబ్బులు ఇస్తే అందరికీ అనుమానం వస్తుందనే ఉద్దేశం తో వీటిని చెలామణి చేసేందుకు హిమాయత్‌ సాగర్‌లోని లార్డ్స్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న తన మేనల్లుడు వాజిహుద్దీన్, అతని స్నేహితుడు టోలిచౌకి వాసి అబ్దుల్‌ సమద్‌ను రంగంలోకి దింపాడు. రెండు లక్షల నకిలీ కరెన్సీని ఇచ్చి కాలేజీ క్యాంటీన్, సిటీలోని మాల్స్‌లో మార్పిడి చేయాలని సూచించాడు.

Advertisement
 
Advertisement
Advertisement