కారు దగ్ధం | Burning car | Sakshi
Sakshi News home page

కారు దగ్ధం

Feb 2 2017 11:50 PM | Updated on Sep 5 2018 9:47 PM

కారు దగ్ధం - Sakshi

కారు దగ్ధం

అంకిరెడ్డిపల్లె ప్రధాన రహదారిపై గురువారం మారుతి ఈకో కారు ప్రమాదవశాత్తు దగ్ధమైంది.

- రూ. లక్ష పట్టుచీరలు బూడిద  
- అంకిరెడ్డిపల్లె వద్ద ఘటన
 
కొలిమిగుండ్ల: అంకిరెడ్డిపల్లె ప్రధాన రహదారిపై గురువారం మారుతి ఈకో కారు ప్రమాదవశాత్తు దగ్ధమైంది.  వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలం మోరగుడి పంచాయతీ సర్పంచ్‌ లక్ష్మీనారాయణ పట్టుచీరలు నేస్తుంటాడు. వ్యాపారుల నుంచి ఆర్డర్‌ రావడంతో చీరలను కారులో లోడ్‌ చేసుకుని అనంతపురం జిల్లా యాడికికి బయలుదేరాడు. అంకిరెడ్డిపల్లె వద్దకు రాగానే కారులో పొగలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు కేకలు వేయడంతో లక్ష్మీనారాయణ కారు ఆపి బయటకు వచ్చాడు. క్షణాల్లోనే మంటలు కారుకంతా వ్యాపించాయి. ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య సిబ్బందితో వచ్చి పరిశీలించారు. అల్ట్రాటెక్‌ సిమెంట్‌ కంపెనీ  ఫైరింజన్‌ సిబ్బందిని రప్పించి మంటలను ఆర్పివేయించారు. కారులోని గ్యాస్‌ సిలెండర్‌ లీకేజీ కారణంగానే మంటలు వ్యాపించాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ‍కారులో ఉన్న లక్ష రూపాయల విలువైన చీరలు కాలిపోయాయని బాధితుడు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement