కావలిఅర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడు రవి పిలుపునిచ్చారు.
బంద్‌ను విజయవంతం చేయండి
Jul 28 2016 11:53 PM | Updated on Sep 4 2017 6:46 AM
కావలిఅర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1వ తేదీన నిర్వహించనున్న బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నాయుడు రవి పిలుపునిచ్చారు. స్థానిక కసాయివీధిలోని సీపీఎం కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయను మాట్లాడారు. తమ సంఘంతో పాటు ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, పీడీఎస్‌ఓ ఆధ్వర్యంలో ఈ బంద్ జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లను తొలగించి పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తోందని విమర్శించారు. మెస్‌బిల్లులు పెంచకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధానకార్యదర్శి మధు మాట్లాడుతూ ఎయిడెడ్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి మనోజ్, సాయి, ప్రకాష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement