వైభవంగా బ్రహ్మ రథోత్సవం | brahma rathothsavam in pavagada | Sakshi
Sakshi News home page

వైభవంగా బ్రహ్మ రథోత్సవం

Mar 12 2017 10:38 PM | Updated on Sep 5 2017 5:54 AM

కణివె శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది.

పావగడ : కణివె శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని వేద మంత్రాలు , వింజామర సేవలతో అర్చకులు రథంలోకి తరలించి ప్రతిష్ఠించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఎండోమెంట్‌ అధికారి , తహసీల్దార్‌ తిప్పూరావు రథాన్ని లాగి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు బ్రహ్మరథంలోకి అరటి పళ్లు విసిరి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. పలువురు ధర్మకర్తలు భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement