ఏ.. నా కొడుకూ విన్పించుకోడు అన్న యువకుడు.. లాగిపెట్టి కొట్టిన ఎమ్మెల్యే 

Video of Karnataka Congress MLA Slapping Youth Goes Viral - Sakshi

పావగడ (కర్ణాటక): స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వెంకటరమణప్ప ఓ యువకున్ని చెంప దెబ్బ కొట్టడం దుమారం రేపింది. ఈ నెల 19 న ఎమ్మెల్యే తాలూకాఫీసులో ఓ సమావేశంలో పాల్గొని బయటికి వస్తుండగా నాగేనహళ్ళికి చెందిన నరేంద్ర అనే యువకుడు హుసేన్‌పురం, ర్యాపిట, నాగేనహళ్ళి గ్రామాలకు చెందిన రోడ్లను ఎప్పుడు వేస్తారని ఎమ్మెల్యే ని ప్రశ్నించాడు. మీ గ్రామాలకు రూ 3.50 కోట్లను మంజూరు చేశామని, వారం లోగా పనుల్ని ప్రారంభిస్తామని ఎమ్మెల్యే బదులిచ్చారు. ఆ యువకుడు... ఏ ....  నా కొడుకూ విన్పించుకోడు అని కోపంగా అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన ఎమ్మెల్యే ఆ యువుకున్ని చెంప దెబ్బ కొట్టాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెంప దెబ్బ వీడియో వైరల్‌ అయ్యింది.

ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా తాలూకాపీసు ఎదుట బీజేపి నాయకులు గురువారం ఆందోళన చేశారు. రోడ్డు వేయాలని కోరితే దాడి చేస్తారా?, ప్రజలను రక్షించాల్సిన ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టడం అమానుషమన్నారు. ఎమ్మెల్యేపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. 

చదవండి: (ఘనంగా మంత్రి కుమారుడి వివాహం)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top