వడదెబ్బకు బాలుడి బలి | boy dies of sun strokes | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు బాలుడి బలి

Apr 16 2017 11:05 PM | Updated on Jul 12 2019 3:02 PM

గుత్తి గాంధీ నగర్‌కు చెందిన షేర్‌వలి కుమారుడు అన్సర్‌(17) వడదెబ్బతో ఆదివారం మరణించినట్లు బంధువులు తెలిపారు.

గుత్తి : గుత్తి గాంధీ నగర్‌కు చెందిన షేర్‌వలి కుమారుడు అన్సర్‌(17) వడదెబ్బతో ఆదివారం మరణించినట్లు బంధువులు తెలిపారు. రెండ్రోజులుగా ఎండలో బాగా తిరిగడంతో శనివారం మధ్యాహ్నం ఇంటికి రాగానే సొమ్మసిల్లి పడిపోయాడన్నారు. వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం మళ్లీ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం పెద్దాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలోనే మృతి చెందినట్లు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement