అనంతలో అంధుల టీ-20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌ | blind t20 world cup match in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో అంధుల టీ-20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌

Feb 3 2017 11:48 PM | Updated on Apr 3 2019 4:04 PM

అనంతలో అంధుల ప్రపంచ క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్లు సమర్థనం డిజేబుల్డ్‌ సంస్థ సభ్యులు వెంకటనారాయణ తెలిపారు.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : అనంతలో అంధుల ప్రపంచ క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌ నిర్వహిస్తున్నట్లు సమర్థనం డిజేబుల్డ్‌ సంస్థ సభ్యులు వెంకటనారాయణ తెలిపారు. ఈ నెల 7న స్థానిక అనంత క్రీడా మైదానంలో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య అంధుల ప్రపంచ క్రికెట్‌ టోర్నీ టీ–20 మ్యాచ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మ్యాచ్‌ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.

ఈ క్రీడా పోటీలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే అనంతలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీలో భారత్‌, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాల్గొంటున్నాయన్నారు.  ఫైనల్‌ మ్యాచ్‌ ఈనెల 12న బెంగుళూరులో జరుగుతుందని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement