మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందపడ్డాడు.
మెంటాడ(విజయనగరం): మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వ్యక్తి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందపడ్డాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా మెంటాడ మండల శివారులో జరిగింది. వివరాలు.. ఆండ్ర నుంచి గజపతినగరం బైక్‌పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులు ఎదురుగా వస్తున్న విజయనగరం డిపోకు చెందిన బస్సు కింద పడ్డారు. దీంతో వారికి స్వల్పగాయాల య్యాయి. ఇది గమనించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.