ప్రాజెక్టులు ఆపాలని బంద్ చేయడమా? | Being such a shame that the opposition we have: THUMMALA | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులు ఆపాలని బంద్ చేయడమా?

Jul 26 2016 1:58 AM | Updated on Sep 4 2017 6:14 AM

ప్రాజెక్టులు ఆపాలని బంద్ చేయడమా?

ప్రాజెక్టులు ఆపాలని బంద్ చేయడమా?

ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాల ని బంద్‌లు, ధర్నాలు చేస్తారని, కానీ ప్రాజెక్టులు ఆపాలని ప్రతిపక్షాలు బంద్‌లు చేయ డం ఏమిటని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రశ్నించారు.

ఇలాంటి విపక్షాలు ఉండడం సిగ్గుచేటు: తుమ్మల  
 
 నాగర్‌కర్నూల్: ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టాల ని బంద్‌లు, ధర్నాలు చేస్తారని, కానీ ప్రాజెక్టులు ఆపాలని ప్రతిపక్షాలు బంద్‌లు చేయ డం ఏమిటని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రశ్నించారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు తెలంగాణలో ఉండ టం సిగ్గుచేటన్నారు. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని, అయినా ప్రతిపక్షాలు రైతులను రెచ్చగొడుతున్నాయన్నారు. గత పాలకుల అసమర్థతతోనే ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని, పూర్తి చేసి నీరందిస్తున్నా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయన్నా రు. ప్రతిపక్షాలు చిల్లరరాజకీయాలను మా నుకోవాలని మంత్రి హితవు పలికారు.

 లెక్కలు చెప్పేందుకు సిద్ధమే: జూపల్లి
 తెలంగాణలో ఎవరెవరి హయాంలో ఏయే ప్రాజెక్టులకు ఎంతెంత నిధులు కేటాయిం చారో లెక్కలు తేల్చుకుందామని సవాల్ విసిరి నా ఎవరూ ముందుకు రావడంలేదని జూపల్లి అన్నారు. నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని సాధించే వరకు పట్టువదలమని నాగం, రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాగంను ఓయూలో ఓ పట్టుపట్టాకే తెలంగాణ గుర్తుకొచ్చిందని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement