కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం | be alert at purchasing | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం

Mar 18 2017 10:40 PM | Updated on Sep 5 2017 6:26 AM

కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం

కొనుగోళ్లలో అప్రమత్తత అవసరం

వస్తువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజీరున్నీసా సూచించారు.

– జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజీరున్నీసా 
నంద్యాల: వస్తువుల కొనుగోళ్లలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజీరున్నీసా సూచించారు. స్థానిక రామకృష్ణ పీజీ కాలేజీలో వినియోగదారుల అవగాహన సదస్సు శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు సేవలు, వస్తువుల నాణ్యతలో లోపాలు, మోసాలు జరిగినట్లు భావిస్తే హక్కుల పరిరక్షణకు ఫోరంను ఆశ్రయించవచ్చన్నారు. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఫిర్యాదు చేయవచ్చన్నారు. రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ రామకృష్ణారెడ్డి వినియోగదారుల రక్షణ చట్టం హక్కులు, బాధ్యతల గురించి వివరించారు.
 
డాక్టర్‌ రామసుబ్బా రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల చట్టం ద్వారా కల్తీని, మోసాలను నివారించవచ్చన్నారు. వినియోగదారులు బిల్లు చెల్లించేటపుడు రసీదును పొందాలన్నాన్నారు. కళాశాల సంచాలకుడు ఆచార్య చంద్రశేఖర్‌రావు వినియోగదారుల చట్టం గురించి వివరించారు. అనంతరం నజీమున్నీసాను సన్మానించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఎల్లయ్య, హేమంత్‌ రెడ్డి, నాగరాజమ్మ, రత్నారెడ్డి, శ్రావణకుమారి, వెంకట్రావు పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement