క్వాలిటీ ఉంటే చాలు.. ఇల్లు కొనేందుకు సిద్ధం! | As Long As It Is Quality People Ready to Buy a House | Sakshi
Sakshi News home page

క్వాలిటీ ఉంటే చాలు.. ఇల్లు కొనేందుకు సిద్ధం!

Sep 13 2025 3:16 PM | Updated on Sep 13 2025 3:32 PM

As Long As It Is Quality People Ready to Buy a House

విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం

నాణ్యమైన నిర్మాణాలకే ప్రాధాన్యం

అందుబాటు గృహాలపై దృష్టి

సాక్షి, సిటీబ్యూరో: ఆధునిక సదుపాయాలు లేకపోయినా పర్వాలేదు.. ఆట స్థలాలకు స్థానం కల్పించకున్నా ఇబ్బంది లేదు.. విస్తీర్ణం తక్కువైనా నో ప్రాబ్లం.. అందుబాటు ధరతో పాటు నిర్మాణంలో నాణ్యత ఉంటే చాలు నగరంలో ఇల్లు కొనేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నట్లు ఓ ప్రాపర్టీ పోర్టల్‌ సర్వే తెలిపింది. సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకొని అందుబాటు ప్రాజెక్ట్‌లను నిర్మించాలని సూచించింది.

మన దేశంలోని నగరాలు, పట్టణాల్లో సుమారు 3 కోట్ల దాకా ఇళ్లు అవసరమవుతాయి. దీంతో బడా డెవలపర్లూ అందుబాటు గృహాల వైపు దృష్టిసారించారు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రవాస భారతీయులు, ఐటీ ఉద్యోగుల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. దీంతో తక్కువ విస్తీర్ణం కలిగిన ఇళ్లకు, స్థానిక కొనుగోలుదారులకు అందుబాటులో ఉండే ఇళ్లకు శ్రీకారం చుట్టారు.

నగరానికి చెందిన పలు నిర్మాణ సంస్థలు అందుబాటు ధరల్లో ఇళ్లను నిర్మించడం మొదలుపెట్టాయి. ఉప్పల్, కూకట్‌పల్లి, మియాపూర్, కొంపల్లి, శామీర్‌పేట వంటి పలు ప్రాంతాల్లో రూ.45 లక్షల్లోపు ఫ్లాట్లు కొనేవారు బోలెడుమంది ఉన్నారు. కానీ, ఈ తరహా నిర్మాణాలు చేపట్టేవారి సంఖ్య తక్కువగా ఉంది. నేటికీ హైదరాబాద్‌ నిర్మాణ రంగం ఐటీ ఉద్యోగుల కొనుగోళ్ల మీదే ఆధారపడి ఉంది. ఇతర నగరాలతో పోలిస్తే నగరంలో రేట్లు తక్కువగా ఉండటం. పెట్టుబడి కోణంలో ఆలోచించేవారు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకునే వారు నగరం వైపు దృష్టిసారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement