నేడు బీసీ సంచార కులాల సమావేశం | BC nomadic castes meeting today | Sakshi
Sakshi News home page

నేడు బీసీ సంచార కులాల సమావేశం

Jan 20 2017 10:57 PM | Updated on Sep 5 2017 1:42 AM

స్థానిక శకుంతల కళ్యాణ మండపం వెనుకువున్న కమ్యూనిటీ హాల్‌లో బీసీ సంచార కులాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు గంగిరెద్దుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు జి. సీతన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు(అర్బన్‌): స్థానిక శకుంతల కళ్యాణ మండపం వెనుకువున్న కమ్యూనిటీ హాల్‌లో బీసీ సంచార కులాల ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు గంగిరెద్దుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు జి. సీతన్న శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అణగారిన, అట్టడుగున ఉన్న అల్ప సంఖ్యాక వర్గాలకు చెందిన కులాలకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌పై ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా కులాలకు చెందిన సంఘాల ప్రతినిధులందరూ ఈ సమావేశానికి హాజరు కావాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement