ఉత్కంఠభరితంగా బాస్కెట్‌బాల్‌ పోటీలు | basket ball comeptitions | Sakshi
Sakshi News home page

ఉత్కంఠభరితంగా బాస్కెట్‌బాల్‌ పోటీలు

Dec 17 2016 11:53 PM | Updated on Sep 4 2017 10:58 PM

ఉత్కంఠభరితంగా బాస్కెట్‌బాల్‌ పోటీలు

ఉత్కంఠభరితంగా బాస్కెట్‌బాల్‌ పోటీలు

మార్టేరు (ఆచంట) : స్థానిక వేణుగోపాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అంతర జిల్లాల స్త్రీ, పురుషుల బాస్కెట్‌ బాల్‌ పోటీలు ఆద్యంతం నువ్వానేనా అన్నట్టు సాగుతున్నాయి.

మార్టేరు (ఆచంట) :  స్థానిక వేణుగోపాల జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అంతర జిల్లాల స్త్రీ, పురుషుల బాస్కెట్‌ బాల్‌ పోటీలు ఆద్యంతం నువ్వానేనా అన్నట్టు సాగుతున్నాయి. స్త్రీల విభాగంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, అనంతపురం, జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. పురుషుల విభాగంలో కృష్ణా, గుంటూరు, అనంతపురం జట్లు సెమీస్‌కు చేరాయి. శనివారం రాత్రికి మొత్తం పోటీలు ముగియ వలసి ఉంది, అయితే సెమీఫైనల్స్‌ పూర్తికాకపోవడంతో ఆదివారం కూడా పోటీలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం జరగనున్నది. మహిళల విభాగంలో శనివారం నిర్వహించిన క్వార్టర్‌ ఫైనల్స్‌లో కృష్ణా గుంటూరుపై 52–42 తేడాతో, తూర్పుగోదావరి, విశాఖపై 36–35, నెల్లూరుపై అనంతపురం 28–10, చిత్తూరుపై పశ్చిమగోదావరి 37–19 పాయింట్ల తేడాతో విజయం సాధించి సెమీస్‌కు చేరుకున్నాయి. పురుషుల క్వార్టర్స్‌లో విశాఖపై కృష్ణా 61–42, కర్నూలుపై గుంటూరు 75–57, పశ్చిమ గోదావరిపై అనంతపురం 60–35 తేడాతో విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించాయి.
 
 

Advertisement
 
Advertisement
Advertisement